కేపీహెచ్బీ పీఎస్ పరిధిలోని పలు ప్రాంతాల్లో.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్ అమలవుతోన్నతీరును ఆయన పరిశీలించారు. కూకట్‌పల్లి నుంచి గోకుల్ ఫ్లాట్స్ వైపునకు వెళ్ళే దారిలో వాహనాల తనిఖీ నిర్వహించారు.
బయటకు వస్తే కేసులు నమోదు చేయండి: సీపీ - lockdown in hyderabad
హైదరాబాద్ నగరంలో లాక్డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయటకు వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్.. కేపీహెచ్బీ పీఎస్ పరిధిలోని పలు చెక్ పోస్టులను పరిశీలించారు.
cp sajjanar
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బయటకు వచ్చే వారిపై కేసులు నమోదు చేయాలని సీపీ.. పోలీసులను ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని కోరారు.
ఇదీ చదవండి:'కొనుగోలు కేంద్రాల వద్ధ రైతుల కష్టాలు కనిపించట్లేదా?'