హైదరాబాద్ నగరంలో అంబులెన్స్ నిర్వాహకులు కొవిడ్ -19 సమయంలో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఐటీ సంస్థల సహకారంతో అందుబాటులోకి తెచ్చిన ఎనిమిది అంబులెన్స్‌లను ఆయన ప్రారంభించారు.
ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించిన సజ్జనార్ - hyderabad latest news today
హైదరాబాద్‌లో ఐటీ సంస్థల సహకారంతో ఎనిమిది ఉచిత అంబులెన్స్‌లను సీపీ సజ్జనార్ ప్రారంభించారు. డయాలసిస్, కరోనా బాధితులు, గర్భిణులతో సహా అత్యవసర సేవల కోసం 94906 17431, 94906 17440 నంబర్లకు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.
ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించిన సజ్జనార్
మరో నాలుగు అంబులెన్స్‌లు సోమవారం నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. డయాలసిస్, కరోనా బాధితులు, గర్భిణులు అత్యవసర సేవలు కావాల్సిన వారు ఈ అంబులెన్స్‌లను ఉచితంగా వినియోగించుకోవచ్చునని సీపీ వెల్లడించారు. అంబులెన్స్ అవసరం ఉన్న వారు 94906 17431, 94906 17440 నంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందాలన్నారు. ఈ అంబులెన్స్‌లను ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ అధికారి పర్యవేక్షిస్తారని సజ్జనార్ వివరించారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సినేషన్: సీఎం కేసీఆర్