సజ్జనార్... సజ్జనార్... ఉదయం నుంచి ఎక్కడ చూసినా ఆ పదమే వినిపిస్తోంది. దిశ హత్యాచారం కేసుల దర్యాప్తులో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక పాత్ర పోషించారు. దర్యాప్తు కోసం బృందాలు ఏర్పాటు చేసి... చివరి వరకు వారికి అనుక్షణం మార్గదర్శనం చేశారు. ఐజీ హోదాలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్‌కు... అంకిత భావంతో... పక్కా ప్రణాళికతో పనిచేసే సమర్థవంతమైన అధికారిగా పేరుంది.
వరంగల్‌లో ఎన్కౌంటర్...
కర్ణాటకకు చెందిన సజ్జనార్ 1996లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. వరంగల్‌లో ఇద్దరు యువతులపై యాసిడ్ దాడులకు పాల్పడిన ఇద్దరు యువకులు... 2008 డిసెంబరులో ఎన్కౌంటర్ అయినప్పుడూ... అక్కడ ఎస్పీగా ఉన్నది సజ్జనారే. ఆ ఎన్‌కౌంటర్‌తో అప్పట్లో సజ్జనార్ ఒక సంచలనం అయ్యారు. ఇప్పుడు దిశ నిందితుల ఎన్ కౌంటర్ సందర్భంగా సీపీగా ఆయనే ఉండటంతో.. ప్రజలు సజ్జనార్‌పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. వాట్సప్ స్టేటస్లు, డీపీలు సజ్జనార్ ఫోటోలతో నిండిపోయాయి. ఫేస్బుక్, ట్విట్టర్లలోనూ సజ్జనార్ ఫోటోలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.