తెలంగాణ

telangana

ETV Bharat / state

70 వేల మంది విమాన ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ - థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ సజ్జనార్

విదేశాల నుంచి వచ్చే వాళ్లకు శంషాబాద్ విమానాశ్రయంలో క్షుణ్ణంగా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ప్రయాణికులు అధికారులకు సహకరించాలని సూచించారు.

CP SAJJANAR VISITED SHAMSHABAD AIRPORT FOR CORNA PRECAUTIONS
థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ సజ్జనార్

By

Published : Mar 18, 2020, 7:26 PM IST

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. ఇప్పటి వరకు 70 వేల మంది విమాన ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నిర్దేశించిన దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను ప్రత్యేక పరిశీలనలో ఉంచేందుకు తగిన ఏర్పాట్లు చేశామని... కేవలం పరిశీలనలో పెట్టినంత మాత్రాన వాళ్లందరికీ కరోనా వైరస్ ఉన్నట్లు కాదని సజ్జనార్ స్పష్టం చేశారు.

కరోనా వైరస్ గురించి సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు వ్యాప్తి చేస్తుండడం వల్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. కరోనాపై తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ సజ్జనార్

ఇవీ చూడండి:రైతు రుణమాఫీకి నిధుల విడుదల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details