లాక్‌డౌన్ నేపథ్యంలో మియాపూర్‌లోని జేపీనగర్, చందానగర్, తారానగర్, పాపిరెడ్డి కాలనీ ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లను సైబరాబాద్ సీపీ సజ్జనార్ సందర్శించారు. లాక్‌డౌన్ అమలు తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. లాక్‌డౌన్ సడలింపు సమయంలో ప్రజలందరూ తమ పనులు త్వరితగతిన పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్లాలన్నారు.
నిబంధనలు కఠినంగా పాటించి కరోనాపై విజయం సాధించాలి: సీపీ - తెలంగాణ లాక్‌డౌన్ వార్తలు
లాక్‌డౌన్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. నిబంధనలు పాటిస్తూ ఉదయం 10లోపే నిత్యావసర సరకులు కొనుగోలు చేసుకోవాలన్నారు. మియాపూర్, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు మార్కెట్లలో ప్రజలు, వ్యాపారులు లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని సీపీ సజ్జనార్ క్షుణ్ణంగా పరిశీలించారు.
CP Sajjanar, hyderabad news
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. సైబరాబాద్ పరిధిలో 75 చెక్ పోస్టులు, 5వేల మంది పోలీసు సిబ్బందితో లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేస్తున్నామన్నారు. ప్రజల సహకారం వల్లే రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. తొమ్మిది రోజులుగా కొనసాగుతోన్న లాక్‌డౌన్‌ను మరో 12 రోజులు కఠినంగా పాటించి కరోనాపై విజయం సాధించాలన్నారు.