అదనపు డీజీలుగా పదోన్నతులు పొందిన సైబరాబాద్ సీపీ సజ్జనార్, హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన వీరిని కేసీఆర్ అభినందించారు. వీరితో పాటు ప్రిన్సిపల్ ఛీప్ కన్జర్వేటివ్ అధికారిగా నియమితురాలైన ఐఎఫ్ఎస్ అధికారిణి శోభ ముఖ్యమంత్రిని కలిశారు.
సీఎం కేసీఆర్‌ను కలిసిన అదనపు డీజీలు - తెలంగాణ తాజా వార్తలు
సైబరాబాద్ కమిషనర్‌గా అదనపు డీజీ హోదాలో సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
సీఎం కేసీఆర్‌ను కలిసిన అదనపు డీజీలు
అదనపు డీజీగా పదోన్నతి పొందిన సైబరాబాద్ సీపీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అదనపు డీజీ హోదాలోనే సైబరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు సజ్జనార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి :'ఎమ్మెల్సీ' ఓట్ల లెక్కింపు రోజున 144 సెక్షన్: సీపీ మహేశ్ భగవత్