ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల ఐకాస ఇచ్చిన రేపటి బస్ రోకోకు అనుమతి లేదని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. ప్రతి బస్ డిపో, బస్ భవన్ వద్ద 500 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆయన చెప్పారు. కార్మికులు గ్రూపులుగా ఏర్పడి ఆందోళన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టులు తప్పవని సీపీ హెచ్చరించారు.
బస్ రోకోకు అనుమతి లేదు: సీపీ - ts rtc strike
రేపటి ఆర్టీసీ కార్మికుల బస్ రోకోకు పోలీసుల అనుమతి లేదని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ స్పష్టం చేశారు. బస్ భవన్, ప్రతి బస్ డిపో వద్ద 500 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు.
బస్ రోకోకు అనుమతి లేదు: సీపీ