కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పిల్లల సంరక్షణ కేంద్రాల్లోని చిన్నారులు పడుతున్న ఇబ్బందులు చూసి... ఓ స్వచ్ఛంద సంస్థ వారికి భోజన వసతి కల్పించడానికి ముందుకొచ్చింది. రాచకొండ పోలీసులు హరియణా నాగరిక్ సమాజం సంయుక్తంగా స్వస్త సేవా పేరిట చిన్నారులకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారు.
ఉచిత భోజన పథకాన్ని ప్రారంభించిన సీపీ మహేశ్ - ఉచిత భోజన పథకాన్ని ప్రారంభించిన సీపీ మహేశ్
హైదరాబాద్ ఉప్పల్‌లోని అభిసాయి చిన్నారుల సంరక్షణ కేంద్రంలో ఉచిత భోజన పథకాన్ని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ప్రారంభించారు. ప్రతిరోజు ఈ కేంద్రంలో చిన్నారులకు హరియణా నాగరిక్ సమాజ్ నిర్వాహకులు భోజనం ఉచితంగా అందజేస్తారని తెలిపారు.
food distribution
ఉప్పల్‌లోని అభిసాయి చిన్నారుల సంరక్షణ కేంద్రంలో ఉచిత భోజన పథకాన్ని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ప్రారంభించారు. ప్రతిరోజు ఈ కేంద్రంలో చిన్నారులకు హరియణా నాగరిక్ సమాజ్ నిర్వాహకులు భోజనం ఉచితంగా అందజేస్తారని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. సమాజ్ ప్రతినిధులు కేంద్రానికి 5 కంప్యూటర్లు, తాగునీటి కూలర్లు అందజేశారు. అవసరమైనవారు తమను సంప్రదిస్తే సహాయం చేస్తామని హరియణా నాగరిక్ సమాజ్ అధ్యక్షుడు అంజనీ అగర్వాల్ తెలిపారు.
- ఇదీ చూడండి: మరోసారి పరస్పర విమర్శలకు దిగిన ఈటల, గంగుల