గ్రేటర్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు : సీపీ మహేశ్ - రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తాజా వార్తలు
జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు : సీపీ మహేశ్
పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాలతో నిఘా ఉందని.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణం కొనసాగుతోందని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకోవాలని.. సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా ఉంచామని వివరించారు.
ఇదీ చూడండి :ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు