తెలంగాణ

telangana

ETV Bharat / state

CP Mahesh Bhagwat: ప్రజ్వల సేవలు అభినందనీయం - cp mahesh bhagwat talk about crimes

ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఎండ్ స్లేవరీ 1కె రన్‌ను హైదరాబాద్‌ ఉప్పల్‌ రింగ్‌ వద్ద నిర్వహించారు. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ జెండా ఊపి ప్రారంభించారు.

Mahesh
ప్రజ్వల సేవలు అభినందనీయం

By

Published : Aug 19, 2021, 11:47 AM IST

రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మహిళ రక్షణ కోసం చేపడుతున్న చర్యలతో మంచి ఫలితాలు వస్తున్నాయని సీపీ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు. మహిళల అక్రమ రవాణాను నిరోధించడంలో 25 ఏళ్లుగా ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విద్యా, ఐటీ సంస్థలు ఉన్న చోట్ల షీ బృందాలు చురగ్గా పని చేస్తున్నాయని సీపీ వివరించారు.

మహిళలను వేధించే ఆకతాయిలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్‌ ఇస్తున్నామని తెలిపారు. ప్రజ్వల స్వచ్చంధ సంస్థ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఎండ్ స్లేవరీ 1కె రన్‌ను ఉప్పల్‌ రింగ్‌ వద్ద నిర్వహించగా.. సీపీ మహేశ్‌ భగవత్‌ జెండా ఊపి ప్రారంభించారు.

ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తైంది. మహిళల అక్రమ రవాణా నిరోధించడంలో ప్రజ్వల స్వచ్ఛంద కృషి చేస్తోంది.ప్రజ్వల సేవలు అభినందనీయం.

- మహేశ్ భగవత్, రాచకొండ సీపీ

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details