వనస్థలిపురం ఎస్‌బీఐ ఏటీఎం చోరీ కేసులో కీలక ఆధారాలు సేకరించామని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. రెండు రోజులు క్రితం ఈ దొంగతనానికి పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠాగా గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. గతంలో ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలో ఏటీఎం చోరీ కేసులో హర్యానా ముఠాని అరెస్టు చేశామని... ఈ చోరీ అదే పద్ధతిలో జరిగిందని పేర్కొన్నారు.
వనస్థలిపురం ఏటీఎం చోరీ: కారణాలు ఇవేనన్న సీపీ - hyderabad latest updates
వనస్థలిపురం ఏటీఎం చోరీ కేసులో కీలక విషయాలను సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. నిందితులను అంతరాష్ట్ర దొంగలుగా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. అలారం లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లు వివరించారు.
కారణాలు ఇవేనన్న సీపీ
ఎస్‌బీఐ అధికారులకు అలారం సిస్టం పెట్టుకోవాలని ఇప్పటికే సూచించామని తెలిపారు. కొన్ని బ్యాంకులు చోరీలు జరగకుండా ఏటీఎం సెంటర్‌లో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయన్నారు. అలారం లేకపోవడం వల్లే పోలీసులకు సకాలంలో సమాచారం అందలేదని స్పష్టం చేశారు.