జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హయత్నగర్, సరూర్ నగర్, విక్టోరియాల్లోని పోలింగ్ కేంద్రాలను సీపీ మహేశ్ భవగత్ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని.. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే మాకు సమాచారం అందించాలని సూచించారు.
ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు: మహేశ్ భగవత్ - ghmc election results 2020
ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరుగుతోందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.
ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు: మహేశ్ భగవత్
ముందుగా హయత్ నగర్ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ తరువాత సరూర్ నగర్, వీఎమ్ఎమ్ హోమ్ కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు సిబ్బందికి సూచలు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు సీపీ వివరించారు.