క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ... ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కొత్తగా విధుల్లో చేరిన 1394 మంది కానిస్టేబుళ్లతో మహేశ్ భగవత్ సమావేశమయ్యారు. పోలీసు విధులంటేనే సవాల్‌తో కూడుకున్నదని... మిగతా శాఖలతో పోలిస్తే పోలీస్ శాఖపై బాధ్యత, ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని మహేశ్ భగవత్ తెలిపారు.
‘క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తే.. గుర్తింపు అదే వస్తుంది’ - రాచకొండ పోలీస్
రాచకొండ కమిషనరేట్ పరిధిలో కొత్తగా విధుల్లో చేరిన 1394 మందితో రాచకొండ సీపీ మహేష్ భగవత్ సమావేశమయ్యారు. క్రమశిక్షణ, పట్టుదలతో శ్రమిస్తే గుర్తింపు అదే వస్తుందని.. పోలీస్ శాఖపై బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. కొత్తగా విధుల్లో చేరుతున్న కానిస్టేబుళ్లకు పలు సూచనలు, సలహాలి ఇచ్చారు.
‘క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తే.. గుర్తింపు అదే వస్తుంది’
పోలీసుగా విధుల్లో చేరిన మరుసటి రోజు నుంచి ప్రతి రోజు ఒక మంచి పని చేయడం అలవాటు చేసుకోవాలని ఆ పనివల్ల ఎదుటి వాళ్ల ముఖంలో సంతోషం కనిపించాలని కొత్త కానిస్టేబుళ్లకు సూచించారు. పీజీలు చదివిన వాళ్లు కూడా కానిస్టేబుల్ ఉద్యోగానికి వచ్చారని... తెలివితేటలను, నైపుణ్యాన్ని ఉపయోగించి పోలీస్ శాఖకు మరింత పేరు తేవాలని ఆయన కోరారు.