కరోనా సోకితే ఎవరూ భయపడద్దని.. సరైన ఆహార జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ అన్నారు. కమిషనరేట్ పరిధిలో కొవిడ్ నుంచి కోలుకుని తిరిగి విధుల్లో చేరిన 7 మందికి ఆయన స్వాగతం పలికారు. నేరెడ్‌మెట్‌లోని కమిషనర్ కార్యాలయంలో వారిని సత్కరించారు. కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 53 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారని తెలిపారు. 7 మంది పూర్తిగా కోలుకున్నారని చెప్పారు. మిగిలిన వారు కూడా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రాచకొండ పరిధిలో 53 మంది పోలీసులకు కరోనా - పోలీసులకు కరోనా
రాచకొండ కమిషనరేట్ పరిధిలో 53 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. వైరస్ బారి నుంచి 7మంది కోలుకున్నారని పేర్కొన్నారు. మిగిలిన సిబ్బంది త్వరలో కోలుకుంటారని ఆకాంక్షించారు.
![రాచకొండ పరిధిలో 53 మంది పోలీసులకు కరోనా CP MAHESH BHAGAVATH says 53 people were infected with corona in RACHAKONDA commissionerate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7914494-779-7914494-1594031316985.jpg)
రాచకొండ కమిషనరేట్‌లో 53 మంది పోలీసులకి కరోనా: సీపీ మహేశ్
ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి... మాస్కులు ధరించకపోతే జరిమానా విధిస్తామని వెల్లడించారు. ఎవరైనా సామూహిక కార్యక్రమాలు, వేడుకలు నిర్వహిస్తే సమాచారం ఇవ్వాలని సీపీ తెలిపారు.
రాచకొండ కమిషనరేట్‌లో 53 మంది పోలీసులకి కరోనా: సీపీ మహేశ్
ఇదీ చూడండి:శ్రీలంక మత్స్యకారులను కాపాడిన భారత కోస్ట్‌గార్డ్స్