తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపటి క్రికెట్ మ్యాచ్​ను చూసేందుకు వెళ్తున్నారా.. అయితే సీపీ సూచనలివే - Security arrangements for tomorrow match complete

CP DS Chauhan on Tomorrow Cricket Match: రేపు ఉప్పల్​లో జరిగే భారత్- న్యూజిలాండ్ వన్డే మ్యాచ్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు. 2500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తామని తెలిపారు. మైదానంలోకి సెల్‌ఫోన్ మినహా మరేదీ అనుమతించమని సీపీ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారు.

Rachakonda CP DS Chauhan
Rachakonda CP DS Chauhan

By

Published : Jan 17, 2023, 6:09 PM IST

CP DS Chauhan on Tomorrow Cricket Match: ఉప్పల్ స్టేడియంలో రేపు జరిగే భారత్‌- న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్‌ అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. పాసులు, బీసీసీఐ కార్డులు ఉన్నవాళ్లు మాత్రమే.. స్టేడియానికి రావాలని సూచించారు. మైదానంలోకి వెళ్లి క్రికెటర్లకు అడ్డుపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ సమస్య రాకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేశామని చెప్పారు. మహిళల కోసం 40మందితో షీ టీం బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు.

బ్లాక్‌ టికెట్​లు అమ్మితే కఠిన చర్యలు:అలాగే మ్యాచ్​కు ఎలాంటి అటంకాలు జరుగకుండా 2500మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని సీపీ డీఎస్ చౌహన్ తెలిపారు. మైదానంలోకి సెల్​ఫోన్‌ తప్పితే ఏదీ అనుమతించమని చెప్పారు. మధ్యాహ్నం 12గంటల నుంచి.. టికెట్ తీసుకున్న క్రికెట్ అభిమానులను లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. బ్లాక్‌ టికెట్​లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్, బ్లాక్ టికెట్​ల పైన ఎస్‌వోటీ, స్థానిక పోలీసులు దృష్టి పెట్టినట్లు సీపీ డీఎస్ చౌహన్ పేర్కొన్నారు.

మ్యాచ్‌ కోసం పటిష్టమైన భద్రత: బ్లాక్ టికెటింగ్‌కు సంబంధించి.. ఇప్పటికే మూడు కేసులు నమోదు అయినట్లు సీపీ డీఎస్ చౌహాన్ వివరించారు. గేట్ వన్​ నుంచి.. ఆటగాళ్లు, బీసీసీఐ ప్రతినిధులు, గవర్నర్‌, సీఎంకు మాత్రమే ప్రవేశం ఉంటుందని వెల్లడించారు. ప్రేక్షకులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని కోరారు. మ్యాచ్‌ కోసం పటిష్టమైన భద్రత కల్పించామని చెప్పారు. మ్యాచ్‌ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు ప్రేక్షకులు తొందరపడొద్దని సీపీ డీఎస్ చౌహాన్ సూచించారు.

"మ్యాచ్​ టికెట్​ల విషయంపై హెచ్​సీఏతో ఈసారి సమావేశం నిర్వహించాం. వారితో సంప్రదింపులు జరిపాం. వారికి కొన్ని సూచనలు చేశాం. మ్యాచ్‌ కోసం పటిష్టమైన భద్రత కల్పించాం. మ్యాచ్‌ టికెట్లు బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. మ్యాచ్‌ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు ప్రేక్షకులు తొందరపడవద్దు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశాం." - డీఎస్ చౌహాన్, రాచకొండ సీపీ

హైదరాబాద్​ చేరుకున్న ఇరుజట్లు:న్యూజిలాండ్‌తో భారత్​ మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. ఇందులో భాగంగానే ఇరు జట్లు తొలి వన్డే కోసం హైదరాబాద్​కు చేరుకున్నాయి. ఇకపోతే 21న రాయ్‌పుర్‌, 24న ఇండోర్‌లో మిగిలిన మ్యాచులు జరుగుతాయి. ఆ తర్వాత 27, 29, ఫిబ్రవరి 1న టీ20 మ్యాచులు జరుగనున్నాయి.

రేపటి క్రికెట్ మ్యాచ్​ను చూసేందుకు వెళ్తున్నారా.. అయితే సీపీ సూచనలివే

ఇవీ చదవండి:కేటీఆర్ మరో ఘనత.. సోషల్​​మీడియాలో ప్రభావితం చేసే వ్యక్తిగా గుర్తింపు

అప్పటి వరకు జేపీ నడ్డానే భాజపా జాతీయ అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details