తెలంగాణ

telangana

ETV Bharat / state

CP CV Anand on Robberies : 'పెరిగిన సాంకేతికతో నేరస్థుల కొత్త పోకడలు.. ఇబ్బందిగా మారుతున్న దర్యాప్తు' - సీపీ ఆనంద్ తాజా వార్తలు

CP CV Anand on Robberies in Hyderabad : పెరిగిన సాంకేతికతను కొందరు నిందితులు అక్రమాలకు వినియోగిస్తున్నారు. కొత్త ఎత్తుగడలతో నేరాలు చేస్తూ భారీ దోపీడీలకు పాల్పడుతున్నారు. పోలీసులకు ఆనవాళ్లు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొన్ని కేసులను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. హైదరాబాద్‌ సీపీ ఆనంద్‌ పలు కేసుల వివరాలను వెల్లడించారు.

CP Anand Latest Update
CP Anand Latest Update

By

Published : May 30, 2023, 10:27 PM IST

క్యూనెట్‌ మల్టీలెవల్‌ మార్కెటింగ్.. రూ.54 కోట్లు సీజ్

CP Anand on Robberies in Hyderabad : ఇటీవల స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంతో మరో కేసు వెలుగులోకి వచ్చింది. హాంకాంగ్‌ గుర్తింపుతో ఉన్న క్యూనెట్‌ మల్టీలెవల్‌ మార్కెటింగ్ కార్యాకలాపాలు నడుపుతోందని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. రూ.30 వేల నుంచి రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ.16 వేల నుంచి రూ.60 వేలు లాభం ఇస్తామని నమ్మిస్తున్నారని పేర్కొన్నారు. ఇలా దాదాపు 159 మంది నుంచి రూ.3 కోట్లు వసూలు చేశారని.. వీరిపై కేసు నమోదు చేసి 35 బ్యాంక్‌ అకౌంట్లను సీజ్‌ చేసి రూ.54 కోట్ల వరకు నగదు జప్తు చేసినట్లు తెలిపారు. క్యూనెట్​పై ఈడీ కేసు సైతం ఉండటంతో కోర్టు ద్వారా బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈస్టోర్‌ ఇండియా సైతం ఇదే తరహాలో మోసం చేస్తోందని సీపీ ఆనంద్‌ వెల్లడించారు.

'ఒక బోగస్ కంపెనీ స్వప్నలోక్ కాంప్లెక్స్​లో పెట్టి.. పెట్టుబడి పెట్టిన తర్వాత అధికంగా లాభలు వస్తాయని చెబుతున్నారు. ఎంప్లాయ్​మెంట్​ లేని వారిని వీరు గుర్తిస్తారు. వారిని అక్కడికి పిలిపించి మల్టీలెవల్ మార్కెటింగ్​లో నమోదు చేసుకుంటే.. మీకు ఇంతా ప్రాఫీట్స్​ వస్తాయి. దానికి మీరు ఇంతా పెట్టుబడి పెట్టాలని చెబుతారు'. -సీవీ ఆనంద్, హైదరాబాద్​ సీపీ

Secunderabad Gold Theft Case Update : 'ఆ రెండు సినిమాలు చూసే సికింద్రాబాద్​ బంగారం చోరీకి ప్లాన్​'

ఈ నెల 27వ తేదీన సికింద్రాబాద్​లోని బంగారం దుకాణంలోకి ఐటీ అధికారులుగా చెప్పుకుని ఆరుగురు వ్యక్తులు దుకాణంలోకి వెళ్లిన కేసులో పోలీసులు చేధించారు. తనిఖీల పేరుతో 17 బంగారం బిస్కెట్లు ఎత్తుకెళ్లిన నిందితుల్లో కొందరిని పట్టుకున్నామని హైదరాబాద్‌ సీపీ వివరించారు. మే 12వ తేదీన జూబ్లీహిల్స్‌లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడు రాజేశ్‌ను అరెస్టు చేశారు. నిందితుడు ఏ ఆధారాలు దొరక్కుండా పక్కాగా రెక్కీ చేసి చోరీ చేసినట్లు సీపీ ఆనంద్‌ తెలిపారు. దాదాపు 1200 సీసీ కెమెరాల 20 రోజుల ఫుటేజీని విశ్లేషించి నిందితుడ్ని పట్టుకున్నామని వివరించారు.

ఇటీవల మలక్‌పేటలో నర్సు అనురాధ హత్య కేసులోనూ నిందితుడు ఆధారాలు చెరిపేందుకు యత్నించాడని పోలీసులు తెలిపారు. సినిమాలు, వివిధ మాధ్యమాల ద్వారా నిందితులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. క్లిష్టమైన కేసులను పరిష్కరించిన పోలీసులను సీపీ ఆనంద్‌ అభినందించారు. గొలుసుకట్టు మోసాలు చేసే కంపెనీల సమాచారం పోలీసులకు అందించాలని ప్రజలకు సూచించారు.

'జాకీర్ ఇతను షాప్​లో ఎంప్లాయ్​మెంట్​ కోసం వస్తే అతనిని షాప్​లో పెట్టుకోవడం జరిగింది. అతను అక్కడి పనితీరు మొత్తం పరిశీలించి వాళ్ల స్నేహితులకు ఫోన్ చేశాడు. ఖానాపూర్​లో ఆరుగురు, 3 గోవా వీళ్లంతా పాత నేరస్థులు దోస్తులు. ఫేక్ ఐటీ అధికారులుగా.. ఐడీ కార్డులు అన్ని తయారు చేసుకుని వాళ్లు చోరీకి బయలుదేరారు. రెండు సినిమాలను చూసి ఆ విధంగా చేయ్యాలని అనుకుని ఇలా చేశారు'. -సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details