Hyderabad police new year celebrations : హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుతల్లి ఫ్లైఓవర్ ప్రధాన కూడలి వద్ద హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పోలీస్ సిబ్బందితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా సీపీ ఆనంద్... హైదరాబాద్ నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గత రెండేళ్లుగా కొవిడ్ మహమ్మారి ప్రభావంతో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని... 2022లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నగర పోలీసులు ప్రజలకు మరింత సేవ చేసేందుకు ముందుంటారని.. ట్రాఫిక్, డ్రగ్స్, నేరాలను నియంత్రిస్తామని తెలిపారు.