తెలంగాణ

telangana

ETV Bharat / state

Cp Anjani Kumar: 'మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవు'

Cp Anjani Kumar: మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ స్పష్టం చేశారు. గంజాయి సంస్కృతి విస్తరిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు వారిపై నిఘా పెట్టాలని కోరారు.

Cp Anjani Kumar Warning
Cp Anjani Kumar Warning

By

Published : Dec 15, 2021, 10:02 PM IST

'మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవు'

Cp Anjani Kumar: గంజాయి నుంచి హాష్‌ ఆయిల్‌ తీసి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన సంపత్‌ కిరణ్​ కుమార్​ను అరెస్టు చేసి 1.5 కిలోల గంజాయి నూనెను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లాకు చెందిన సంపత్‌ పాడేరులోని డీలర్ల సహాయంతో హైదరాబాద్‌లో హాష్‌ ఆయిల్‌ విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు సీపీ అంజనీకుమార్‌ తెలిపారు.

మరో కేసులో మహ్మద్‌ ఇర్ఫాన్‌, షేక్‌ కమాల్‌ అనే ఇద్దరిని అరెస్టు చేసి రెండు లీటర్ల హాష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. మొత్తంగా రెండు కేసుల్లో పట్టుకున్న హాష్‌ ఆయిల్‌ విలువ రూ.25లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని సీపీ అంజనీకుమార్‌ సూచించారు.

'అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశాం. వీరి నుంచి 3.5 లీటర్ల హష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నాం. దీని విలువ 25 లక్షలు రూపాయలు ఉంటుంది. ప్రధాన నిందితుడు.. సంపత్ కిరణ్ కుమార్ అలియాస్ జాన్ నుంచి 3.5 లీటర్ల హష్ ఆయిల్ సీజ్ చేశాం. పబ్స్​లో మైనర్లకు మద్యం అమ్మితే కట్టిన చర్యలు తీసుకుంటాం. పిల్లలపై కూడా తల్లి దండ్రులు నిఘా పెట్టాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా కొనసాగుతాయి. మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై కేసులు నమోదు చేస్తాం.'

-- అంజనీకుమార్, హైదరాబాద్ సీపీ

ఇదీ చూడండి: CP Anjani kumar News: హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌కు లీగల్‌ నోటీసు

ABOUT THE AUTHOR

...view details