నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ బేగంపేట పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసుల పనితీరు పట్ల ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. కొన్ని విభాగాల్లో లోపాలు ఉన్నట్లు వాటిని త్వరలోనే సరిచేసుకోవాలని సూచించారు. పలు విభాగాల్లో పోలీసుల పనితీరుపై వారిని అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో కొన్ని సందర్భాల్లో విఫలమవుతున్నారని.. ప్రజలతో పోలీసులు మరింత వృద్ధి సాధించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ నిర్వహణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో కొన్ని లోపాలు ఉన్నట్లు వాటిని సరి చేసుకుంటామని సీఐ తనకు హామీ ఇచ్చినట్లు తెలిపారు..టెక్నాలజీ పరంగా పిటిషన్ తీసుకోవడంలో పోలీసుల తీరు అభినందనీయమన్నారు. ప్రజల రక్షణకు టెక్నాలజీని ఉపయోగించాలని ఆయన సూచించారు.
బేగంపేట పీఎస్‌లో సీపీ ఆకస్మిక తనిఖీ - friendly policing
బేగంపేట పోలీస్‌స్టేషన్‌ను సీపీ అంజనీకుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు విభాగాల్లో పోలీసుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది పనితీరు పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. లోపాలను సరిచేసుకోవాలని సూచించారు.
బేగంపేట పీఎస్‌లో సీపీ ఆకస్మిక తనిఖీ