పోలీస్ డిపార్ట్మెంట్ హీరోస్‌ను స్వాగతిస్తున్న తీరు చాలా సంతోషంగా ఉందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ హర్షం వ్యక్తం చేశారు. నక్సల్స్ సమస్య నుంచి కరోనా వరకు అన్ని సమస్యలను పోలీసులు ముందుడి ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. పోలీస్ శాఖ సిస్టం ఎప్పుడు ఫెయిల్ కాదని ఆయన వెల్లడించారు. దేశంలోని ఇతర ప్రధాన ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లో తక్కువ కరోనా కేసులు రావడానికి సిటీ పోలీసులే కారణమని సీపీ తెలిపారు.
మా సిస్టం ఎప్పుడూ ఫెయిల్ కాదు: సీపీ అంజనీ కుమార్ - latest news of cp anjanikumar spoke about police
పోలీస్ సిస్టం ఎప్పుడూ ఫెయిల్ కాదని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. కరోనా కట్టడిలో హైదరాబాద్ పోలీసుల పాత్ర ఎనలేనిదని... జనతా కర్ఫ్యూ మొదలు ఇప్పటి వరకూ నిర్విరామ కృషిచేస్తున్న పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మా సిస్టం ఎప్పుడూ ఫెయిల్ కాదు: సీపీ అంజనీ కుమార్
జనతా కర్ఫ్యూ నుంచి ఇప్పటివరకు ప్రతి సందర్భంలోనూ పోలీసులే ముందున్నారన్నారు. పోలీసుల కుటుంబసభ్యులకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనా కట్టడిలో సిటీ పోలీసుల కృషి ఎనలేనిదని.. చరిత్రపుటలో నిలుస్తుందని ఆయన అన్నారు. కరోనాను జయించాక కూడా తిరిగి మాస్కులు... శానిటైజర్లు వాడాలని... భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు.
ఇవీ చూడండి:హోంమంత్రికి కరోనా.. వైద్యాధికారులు ఏమంటున్నారంటే?