ఆసుపత్రికి వెళ్లేందుకు రోడ్డుపై వాహనం కోసం ఎదురు చూస్తున్న ఓ గర్భిణీని తమ వాహనంలో ఆస్పత్రిలో చేర్పించిన గోపాలపురం పోలీసులను హైదరాబాద్ సీపీ అభినందించారు. సికింద్రాబాద్ అంబేద్కర్ నగర్‌కు చెందిన స్వాతి అనే గర్భిణీ సంగీత్ చెక్ పోస్ట్ వద్ద లాక్ డౌన్ కారణంగా ఆస్పత్రికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో అక్కడే ఉన్న గోపాలపురం కానిస్టేబుల్ ధనరాజ్, హోంగార్డు సిద్ది రాములు గమనించారు.
గోపాలపురం పోలీసులకు సీపీ అంజనీకుమార్ అభినందన - గోపాలపురం పోలీసులకు అభినందన
గోపాలపురం పోలీసులను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అభినందించారు. ఆసుపత్రి వెళ్లేందుకు గర్భిణీకి సాయం చేసిన కానిస్టేబుళ్లను ఆయన ప్రశంసించారు. సీపీ కార్యాలయంలో ముగ్గురిని సత్కరించారు.
cp
ఈ విషయాన్ని సీఐ సాయి ఈశ్వర్ గౌడ్‌కి వివరించారు. ఆయన ఆదేశాల మేరకు ఆమెను వెంటనే కోటి మెటర్నిటి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు చేసిన సహాయానికి ఆ గర్భిణీ కృతజ్ఞతలు తెలిపింది. విషయం తెలుసుకున్న సీపీ అంజనీ కుమార్ వారిని అభినందించారు. ముగ్గురిని తన కార్యాలయంలో సత్కరించారు.