హైదరాబాద్‌లో కరోనా విషయంలో చాలా భద్రంగా ఉన్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ప్రతి మనిషికి ఏడాదిలో ఓ సారి జ్వరం, జలుబు లాంటివి తప్పక వస్తాయని... దీనికి భయపడాల్సిన అవసరంలేదని సీపీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 65మంది పోలీసు అధికారులు కరోనా నుంచి కోలుకుని తిరిగి విధుల్లో చేరారని తెలిపారు.
కరోనా విషయంలో మనం చాలా భద్రంగా ఉన్నాం: సీపీ అంజనీకుమార్ - corona cases in police department
ప్రతీ మనిషికి ఏడాదిలో ఓ సారి జ్వరం, జలుబు లాంటివి తప్పక వస్తాయని.. ఈ మాత్రం దానికి భయపడాల్సిన అవసరంలేదని సీపీ అంజనీకుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో కరోనా విస్తురిస్తున్న దృష్యా చాలా భద్రంగానే ఉన్నామన్నారు. ప్రతిరోజు తప్పక కనీసం నాలుగు సార్లు అయినా వేడి నీరు తీసుకోవాలని... ఉప్పు నీటితో గార్గిల్ చేయాలని సూచించారు.
కరోనా విషయంలో మనం చాలా భద్రంగా ఉన్నాం: సీపీ అంజనీకుమార్
ప్రతిరోజు తప్పక కనీసం నాలుగు సార్లు అయినా వేడి నీరు తీసుకోవాలని... ఉప్పు నీటితో గార్గిల్ చేయాలని సూచించారు. చల్లని పానియాలు తాగటం, ధూమపానానికి దూరంగా ఉండాలన్నారు.
నగరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 97 మంది ట్రాఫిక్ పోలీసు అధికారులకు సర్టిఫికేట్లతోపాటు మెమోంటోలు అందజేశారు. ఎన్నడూలేని విధంగా... కరోనా సమయంలో పోలీసు శాఖకు మంచి పేరు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆరోగ్య భద్రత ఉన్న ప్రతి ఆసుపత్రికి ఒక లైసన్ ఆఫీసర్‌ను నియమించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో కరోనా విలయతాండవం... 20వేలు దాటిన కేసుల సంఖ్య
Last Updated : Jul 21, 2022, 1:02 PM IST