సకాలంలో రక్తం అందక చాలా మంది మృతి చెందుతున్నారని.. రక్తదానం ప్రాణదానంతో సమానమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. పేట్లబురుజులోని ఆర్మ్డ్ రిజర్వు ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని సీపీ ప్రారంభించారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 100 మందికి పైగా పోలీసులు రక్తదానం చేశారు.
రక్తదానం ప్రాణదానంతో సమానం: అంజనీకుమార్ - telangana latest news
రక్తదానం ప్రాణదానంతో సమానమని సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో రక్తం అందక ఎంతో మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు.
రక్తదానం ప్రాణదానంతో సమానం: అంజనీకుమార్
తలసేమియా వ్యాధిగ్రస్తులకు తరచూ రక్తం అందించాల్సి ఉంటుందని.. ఇందుకోసం హైదరాబాద్ కమిషనరేట్ తరఫున రక్తదానం చేసి బాధితులకు అందిస్తున్నామని అంజనీకుమార్ పేర్కొన్నారు. అవగాహనతోనే తలసేమియా వ్యాధి నివారణ సాధ్యమని తెలిపారు.
ఇదీ చూడండి: గోడ పడిపోకుండా కర్రల సపోర్ట్... స్థానికుల ఆశ్చర్యం