రంజాన్ మాసం చివరి శుక్రవారం కావడం వల్ల హైదరాబాద్ చార్మినార్ ప్రాంతాన్ని సీపీ అంజనీ కుమార్ సందర్శించారు. ముందు జాగ్రత్త చర్యగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రార్థనలు ఇళ్లలోనే జరుపుకోవాలి.. బయటకొస్తే కఠిన చర్యలు: సీపీ
రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా చార్మినార్ ప్రాంతంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పర్యటించారు. అక్కడ పోలీసులు బందోబస్తును పరిశీలించారు. కరోనా పట్ల జాగ్రత్తగా ఉండి ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు.
ప్రార్థనలు ఇళ్లలోనే జరుపుకోవాలి.. బయటకొస్తే కఠిన చర్యలు: సీపీ
కరోనా ప్రభావంతో ప్రజలు తమ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సంవత్సరం చివరి శుక్రవారం రోజు పాతబస్తీ మక్కా మసీద్ వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించేవారు.
ఇదీ చూడండి :మంత్రులు సమక్షంలో మార్కెట్ కమిటీ పాలక మండలి ఎన్నిక