తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆరు నెలల్లో హైదరాబాద్​లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..' - హైదరాబాద్​లోని ఆరు నెలల నేగాల జాబితా విడుదల

హైదరాబాద్‌లో గత 6 నెలల్లో జరిగిన నేరాలపై సీపీ అంజనీకుమార్ నివేదిక‌ విడుదల చేశారు. 2019తో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో నేరాలు తగ్గాయని సీపీ వివరించారు.

cp anjani kumar released  first six months of this year crime report of hyderabad
ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో నేరాలు తగ్గాయి: సీపీ అంజనీ కుమార్​

By

Published : Jul 8, 2020, 6:34 PM IST

2020 ఏడాది తొలి 6 నెలల్లో హైదరాబాద్​లో జరిగిన నేరాలపై నివేదికను సీపీ అంజనీ కుమార్ విడుదల చేశారు. 2019తో పోలిస్తే ఈ ఏడాది తొలి అర్ధవార్షికంలో 100 నేరాలు తగ్గాయని తెలిపారు. కరోనా నేపథ్యంలో.. సామూహిక బోనాల ఉత్సవాలకు అనుమతి లేదని... అందరూ వారి ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు.

ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 12,273 క్రిమినల్​ కేసులు నమోదుయ్యాయి. కొత్తగా 146 మంది రౌడీషీటపై కేసులు రికార్డు చేశాం. ఇప్పటివరకు 26 శాతం మంది నేరస్థులకు శిక్షపడింది.ఈ ఏడాది 154 ఇళ్లలో చోరీ కేసులు కాగా... నగరంలో ఈ ఏడాది మొత్తం 835 చోరీ కేసులు నమోదయ్యాయి. 500కు పైగా సైబర్​ నేరాలు పెరిగాయి. - అంజనీ కుమార్​, హైదరాబాద్​ సీపీ

ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో నేరాలు తగ్గాయి: సీపీ అంజనీ కుమార్​

ఇదీ చూడండి:సచివాలయం కూల్చివేతపై లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ తిరస్కరణ

ABOUT THE AUTHOR

...view details