తెలంగాణ

telangana

ETV Bharat / state

corona: కొవిడ్​పై అవగాహన కల్పించడానికి పోలీసుల కృషి - తెలంగాణ వార్తలు

కొవిడ్(covid)​పై అవగాహన కల్పించడానికి పోలీసులు కృషి చేస్తున్నారని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఖైరతాబాద్ కూడలి వద్ద ఓ కళాకారుడితో కరోనా(corona) చిత్రాన్ని గీయించారు. కరోనాకు, ప్రజలకు మధ్య పోలీసులు రక్షణగా ఉన్నట్లు చిత్రాన్ని గీసిన కళాకారుడిని సీపీ ప్రశంసించారు.

cp anjani kumar, corona
సీపీ అంజనీ కుమార్, కరోనా

By

Published : May 29, 2021, 10:29 PM IST

కొవిడ్(covid) వల్ల కలిగే ఇబ్బందులపై అవగాహన కల్పించేలా పోలీసులు కృషి చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఖైరతాబాద్ కూడలి వద్ద చిత్రీకరించిన కరోనా(corona) బొమ్మను సీపీ పరిశీలించారు. 'ఇంట్లోనే ఉండండి- కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి' అని రాసి ప్రజలను చైతన్యవంతం చేసేలా ఓ కళాకారుడితో ఈ బొమ్మ గీయించారు. ఈ చిత్రాన్ని చూసిన వాహనదారులకు కరోనా పట్ల అవగాహన కలుగుతుందని అన్నారు. కరోనాకు, ప్రజలకు మధ్య పోలీసులు రక్షణగా ఉన్నట్లు చిత్రాన్ని గీసిన కళాకారుడిని సీపీ ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details