తెలంగాణ

telangana

ETV Bharat / state

'జంటనగరాల్లో ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదు' - HYDERABAD POLICE SAID NO PROTESTS IN CITY

జంటనగరాల్లో రహదారులపై ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ కార్యక్రమానికైనా... అనుమతించేది లేదని నగర పోలీసు కమిషనర్​ అంజనీకుమార్​ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు ఎవరి కార్యాలయాల్లో వాళ్లు సభలు నిర్వహించుకుంటే అభ్యంతరం లేదని తెలిపారు.

CP ANJANI KUMAR ON PROTESTS IN HYDERABAD
CP ANJANI KUMAR ON PROTESTS IN HYDERABAD

By

Published : Dec 26, 2019, 7:28 PM IST

Updated : Dec 26, 2019, 8:07 PM IST

హైదరాబాద్‌లో ర్యాలీలు, నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేదని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ స్పష్టం చేశారు. ఈ నెల 28న ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్డు పరిసరాల్లో ఎటువంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదని సీపీ తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే జంటనగరాల్లోని రహదారులపై ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ర్యాలీలు, సభలు, నిరసనలు నిర్వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు.

'జంటనగరాల్లో ర్యాలీలు, నిరసనలు చేయటానికి వీల్లేదు'
Last Updated : Dec 26, 2019, 8:07 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details