నాలుగో విడతహజ్యాత్రకు భక్తులు ఇవాళ తరలివెళ్లారు.హైదరాబాద్ నాంపల్లిలోని హాజ్‌హౌస్ నుంచి యాత్రకు బయల్దేరుతున్న బస్సును నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం హజ్‌యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తున్నారని, ముఖ్యంగా మైనార్టీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. హజ్‌యాత్రకు వెళ్లే యాత్రికులు దర్శనం చేసుకుని క్షేమంగా తిరిగి రావాలని సీపీ అకాంక్షించారు.
హజ్‌యాత్రికుల బస్సును జెండా ఊపి ప్రారంభించిన సీపీ - cp
నగరం నుంచి హజ్‌యాత్రకు వెళ్లే బస్సును హైదరాబాద్ నగర సీపీ అంజనీ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
![హజ్‌యాత్రికుల బస్సును జెండా ఊపి ప్రారంభించిన సీపీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4030720-169-4030720-1564833646250.jpg)
హైదరాబాద్‌లో హజ్‌యాత్ర ప్రారంభం