తెలంగాణ

telangana

ETV Bharat / state

క్యాబ్‌లను ప్రారంభించిన సీపీ అంజనీకుమార్‌ - CP Anjanikumar Latest news

లాక్‌డౌన్‌ వేళ మహేంద్ర ఎలైట్‌ ఆఫ్‌ లాజిస్టిక్స్‌ సంస్థ ప్రవేశపెట్టిన ఉచిత క్యాబ్‌లను హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ ప్రారంభించారు. సీనియర్‌ సిటిజెన్స్‌, గర్భిణీలు, పిల్లల ఆరోగ్య సమస్యల కోసం 7 క్యాబ్‌లను అందుబాటులో ఉంచనున్నారు.

క్యాబ్‌లను ప్రారంభించిన సీపీ అంజనీకుమార్‌
క్యాబ్‌లను ప్రారంభించిన సీపీ అంజనీకుమార్‌

By

Published : Apr 14, 2020, 6:21 PM IST

లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలో మహేంద్ర ఎలైట్‌ ఆఫ్‌ లాజిస్టిక్స్‌ సంస్థ ఉచితంగా క్యాబ్‌ సర్వీసులను అందించేందుకు ముందుకు వచ్చింది. బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్ జెండా ఊపి క్యాబ్‌ సేవలను ప్రారంభించారు. ఇప్పటికే రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ సేవలున్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇక నుంచి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సేవలను అందించనున్నట్లు వారు పేర్కొన్నారు. సీనియర్ సిటిజెన్స్, గర్భిణీలకు, పిల్లల ఆరోగ్య సమస్యలు, అత్యవసర సేవల కోసం నిరంతరం 7 క్యాబ్‌లను ఉచితంగా అందుబాటులో ఉంచామన్నారు. క్యాబ్ బుకింగ్ కోసం 8433958158 నంబర్‌కు ఫోన్‌ చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details