తెలంగాణ

telangana

ETV Bharat / state

CP: ప్రజల భాగస్వామ్యంతో నేరాల అదుపు: సీపీ - city police

ప్రజల భాగస్వామ్యంతో నేరాలను అదుపు చేయగలుగుతున్నామని సీపీ అంజనీ కుమార్(cp anjani kumar) అన్నారు. కరోనా సంక్షోభంలో సిటీ పోలీసులు కలసికట్టుగా విధులు నిర్వహించారని కొనియాడారు. హైదరాబాద్​, వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హాల్​ను ఆయన ప్రారంభించారు.

cp anjani kumar
cp anjani kumar

By

Published : Jun 11, 2021, 6:35 PM IST

హైదరాబాద్​, వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హాల్​ను సీపీ అంజనీ కుమార్(cp anjani kumar) ప్రారంభించారు. కరోనా సంక్షోభంలో సిటీ పోలీసులు కలసికట్టుగా విధులు నిర్వహించారని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదుర్కొంటూ ముందుకెళ్లాలని సూచించారు. హాల్ నిర్మాణానికి సహకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల భాగస్వామ్యంతో నేరాలను అదుపు చేయగలుగుతున్నామని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో.. నగర ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్, షీ టీమ్స్ అదనపు సీపీ శిఖా గోయల్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రాజ్​భవన్​లో సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణకు ఘనస్వాగతం

ABOUT THE AUTHOR

...view details