హిజ్రాలు కూడా సమాజంలో భాగమేనని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసుల ఆధ్వర్యంలో నగరంలోని హిజ్రాలకు నిత్యావసర సరుకులు అందించారు.
హిజ్రాలకు నిత్యావసరాలు అందించిన సీపీ అంజనీకుమార్ - hyderabad cp
బంజారాహిల్స్ పోలీసుల ఆధ్వర్యంలో నగరంలోని హిజ్రాలకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సీపీ అంజనీకుమార్ హాజరై.. నిత్యావసరాలను అందజేశారు.
హిజ్రాలకు నిత్యావసరాలు అందించిన సీపీ అంజనీకుమార్
లాక్డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న హిజ్రాలను ఆదుకునేందుకే నిత్యావసర సరకులు పంపిణీ చేసినట్లు సీపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిజ్రాలు భౌతిక దూరం పాటిస్తూ కూర్చోవడాన్ని ఆయన అభినందించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే లాక్డౌన్ కొనసాగుతోందని.. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లోనే ఉండి సహకరించాలని కోరారు. ఇవీ చూడండి:సాదాసీదాగా తెజస వార్షికోత్సవం