హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పుట్టినరోజు వేడుకను పోలీస్ అధికారులు ఘనంగా నిర్వహించారు. నాంపల్లి నూతన పోలీస్ స్టేషన్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీపీకి.. కార్యక్రమం అనంతరం ఠాణా ఆవరణలోనే జన్మదిన వేడుకను నిర్వహించారు.
ఘనంగా సీపీ అంజనీకుమార్ పుట్టినరోజు వేడుక - cp anjani kumar birthday latest news
సీపీ అంజనీకుమార్ పుట్టినరోజు వేడుకను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ ఉన్నతాధికారులు ఘనంగా నిర్వహించారు. సీపీ చేత కేక్ కట్ చేయించి.. శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా సీపీ అంజనీకుమార్ పుట్టినరోజు వేడుక
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ ఉన్నతాధికారుల సమక్షంలో అంజనీ కుమార్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులు సీపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ పోలీస్ కమిషనర్ ధన్యవాదాలు తెలిపారు.