ఆవు సంరక్షణ అనేది మతంతో ముడిపడిన అంశం కాదని సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సభ్యుడు నిరూప్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆవులను రక్షించుకోవటం ప్రతి పౌరుని బాధ్యత అని.. ఏరకంగాను ఆవును వధించటం అనేది చట్టరీత్యా నేరమని ఆయన తెలియజేశారు. హైదరాబాద్ టూరిజం ప్లాజా హోటల్లో ఆవుల వధ, వాటి సంరక్షణ పైన ఏర్పాటు చేసిన మేధోమథన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
గో సం'రక్షణ' అందరి కర్తవ్యం - COW_PROTECTION
హైదరాబాద్ టూరిజం ప్లాజా హోటల్లో ఆవుల వధ, వాటి సంరక్షణ పైన మేధోమథన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆవుల అక్రమ రవాణా, వాటి వధ, దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులపై వక్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
గో సం'రక్షణ' అందరి కర్తవ్యం
అహం టాక్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ చర్చాగోష్టిలో ఆవుల అక్రమ రవాణా, వాటి వధ, దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులపై వక్తలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. నమ్మాకాలు, చట్టాలు, శాస్త్రాలు ఇలా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆవుల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, గోశాలలను పెంచాలని వక్తలు డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: 'లౌకికవాదం నుంచి ఏనాడూ వెనక్కి తగ్గని వ్యక్తి జైపాల్'