Cow Gives Milk to Boy : మనుషులకే కాదు.. మూగజీవాలకూ మనసు ఉంటుందని ఓ ఆవు నిరూపించింది. బాలుడికి పాలిస్తూ అమ్మతనంలోని ఔన్నత్యాన్ని చాటింది. బాలుడు పాలు తాగుతున్నంత సేపు కదలకుండా ఆ ఆవు అమ్మ ప్రేమను చూపించింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కోసిగిలో ఈ ఘటన జరిగింది. ఓ చిన్నారి ఆడుకుంటూ ఇంట్లో ఉన్న గోవు దగ్గరికి వెళ్లాడు. అంతటితో ఆగకుండా నేరుగా ఆవు పాలు తాగాడు.
Viral Video: బాలుడికి పాలిచ్చిన ఆవు.. వీడియో వైరల్ - Kurnool District News
Cow Gives Milk to Boy: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాలుడు ఆడుకుంటూ.. ఇంట్లో ఉన్న గోవు దగ్గరికి వెళ్లి పాలు తాగుతున్నాడు. ఆ సమయంలో ఆవు కదలకుండా ఉండిపోయింది.
![Viral Video: బాలుడికి పాలిచ్చిన ఆవు.. వీడియో వైరల్ Cow Gives Milk to Boy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17249196-844-17249196-1671456763163.jpg)
బాలుడికి పాలిచ్చిన ఆవు
విచిత్రం ఏమిటంటే ఆ బాలుడు పాలు తాగుతున్నంత సేపు.. ఆవు కదలకుండా అలాగే ఉండిపోయింది. చిన్నారికి పాలిచ్చిన ఆవు అమ్మ ప్రేమను చూపించింది. బాలుడు ఒకటి, రెండు సార్లు కాదు.. ఒక నిమిషం వ్యవధిలో ఆవు చూట్టు తిరుగుతూ రెండు, మూడు సార్లు అలాగే తాగినా.. ఆవు ఆ బాలుడ్ని ఏమీ అనలేదు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
బాలుడికి పాలిచ్చిన ఆవు.. వీడియో వైరల్
ఇవీ చదవండి: