దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన గుడికో గోమాత కార్యక్రమాన్ని తితిదే పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. జూబ్లీహిల్స్‌లోని శ్రీ వెంకటేశరస్వామి ఆలయంలో గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. సకల దేవతల స్వరూపమైన గోమాతను పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. గోమాతను పూజించడం అంటే తల్లిని పూజించడమేనని అన్నారు.
'గోమాతల సంరక్షణ బాధ్యత దేవాలయ సభ్యులదే' - జూబ్లీహిల్స్‌లోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభం
సకల దేవతల స్వరూపమైన గోమాతను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని తితిదే పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
గుడికో గోమాత కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపడుతున్నామని దీనిలో భాగంగానే తెలంగాణలో ప్రారంభించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని పది జిల్లాల్లో జిల్లాకు 5 నుంచి 10 దేవాలయాలకు గోవులను అందించే కార్యక్రమాన్ని మూడునెలల్లో పూర్తి చేస్తామన్నారు. భక్తులెవరైనా గోవులను దానం చేయవచ్చని ఆయన సూచించారు. గోవులను సంరక్షించే బాధ్యత దేవాలయ సభ్యులదేనని స్పష్టం చేశారు. తెలంగాణలో ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభపరిణామమని టీటీడీ సభ్యుడు శివకుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఏసీ అధ్యక్షుడు గోవిందహరి, సభ్యులు రవీందర్ పాల్గొన్నారు.