ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు కొవిడ్ వారియర్స్ ప్రయత్నించారు. వారికి అనుమతి లేదంటూ.. పోలీసులు అడ్డుకున్నారు. కొవిడ్ ఆస్పత్రుల్లో సేవలు చేసిన తమను విధుల నుంచి తప్పించారని... కొవిడ్ వారియర్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న కొవిడ్ వారియర్స్ - Covid Warriors Latest news
అంతర్వేది పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ను కలిసేందుకు.. కొవిడ్ వారియర్స్ ప్రయత్నించారు. వారిని పోలీసులు అనుమతించలేదు. ఆవేదనకు గురైన వాళ్లంతా... రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కాళ్లు పట్టుకున్నారు. తమ సమస్యలు తెలిపి పరిష్కరించాలని.. న్యాయం చేయాలని కోరారు.
![ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న కొవిడ్ వారియర్స్ covid-warriors-protest-in-antarvedi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10691541-1059-10691541-1613728856320.jpg)
న్యాయం కావాలంటూ ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న కొవిడ్ వారియర్స్
న్యాయం కావాలంటూ ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న కొవిడ్ వారియర్స్
ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కాళ్లు పట్టుకుని.. సమస్యలు పరిష్కరించాలంటూ ప్రాధేయపడ్డారు. కొవిడ్ ఆసుపత్రుల్లో విశేష సేవలు చేసిన తమను ప్రభుత్వం విధుల నుంచి తొలగించిందని ఆవేదన చెందారు. విధుల్లో కొనసాగించేలా చూడాలని వేడుకున్నారు.
న్యాయం కావాలంటూ ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న కొవిడ్ వారియర్స్