రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతిలోనూ రోగులకు విశేష సేవలు అందించినందుకు గానూ... బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి... పలు పురస్కారాలు వరించాయి. ఆస్పత్రి సీనియర్ వైద్యులు డాక్టర్ ఆర్వీ ప్రభాకరరావు అందించిన ప్రత్యేక సేవలను వరల్డ్ హెల్త్, వెల్‌నెస్ కాంగ్రెస్ గుర్తించాయి. తెలంగాణ హెల్త్‌కేర్ లీడర్‌షిప్ అవార్డుకు ఆయనను ఎంపిక చేశాయి.
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి అవార్డు - తెలంగాణ తాజా వార్తలు
కరోనా సమయంలోనూ విశేష సేవలు అందించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి కొవిడ్ వారియర్ పురస్కారం వరించింది. ఆస్పత్రి సీనియర్ వైద్యులు డాక్టర్ ఆర్వీ ప్రభాకరరావు అందించిన ప్రత్యేక సేవలకుగాను తెలంగాణ హెల్త్‌కేర్ లీడర్‌షిప్ అవార్డుకు ఆయనను ఎంపికయ్యారు.
అటు కరోనా విజృంభణలోనూ బసవతారకం ఆస్పత్రి బృందం.. నిరంతరాయంగా క్యాన్సర్ రోగులకు కీమో, రేడియో థెరపీ సహా అన్నిరకాల చికిత్సలను అందించిందని.. గాలెంట్ మీడియా, రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కొనియాడాయి. డాక్టర్ ప్రభాకరరావుతో పాటు బసవతారకం ఆస్పత్రికి.. కొవిడ్ వారియర్ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ పురస్కారాలను ఆన్‌లైన్‌లో కేంద్రసహాయ మంత్రి ఫఘన్‌సింగ్ పులస్తే ద్వారా అందజేశాయి. ఈ సందర్భంగా ప్రభాకరరావును ఆస్పత్రి ఛైర్మన్ బాలకృష్ణ, సిబ్బంది అభినందించారు.
ఇవీచూడండి:'ఎన్నికల ప్రచారం నిర్వహించిన వారు క్వారంటైన్‌లో ఉండాలి'