రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 1,82,523 మందికి కొవిడ్ టీకాలు అందించినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం టీకాలు తీసుకున్న వారి సంఖ్య 86,92,261కి చేరింది. ఇందులో 4లక్షల 42వేల 813మంది హెల్త్ కేర్ వర్కర్లు, 3 లక్షల 65వేల 505 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు , 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారు 22లక్షల 44వేల 715మంది, 45 ఏళ్లు పైబడిన 56లక్షల 39వేల 228 మంది ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
Vaccination: 24 గంటల్లో రాష్ట్రంలో 1,82,523మందికి టీకాలు
రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 1,82,523మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 86,92,261 మందికి టీకాలు వేసినట్లు పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి మొత్తం 881 టీకా కేంద్రాల ద్వారా వ్యాక్సిన్లను అందిస్తున్నారు.
24 గంటల్లో రాష్ట్రంలో 1,82,523మందికి టీకాలు
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి మొత్తం 881 టీకా కేంద్రాల ద్వారా వ్యాక్సిన్లను అందిస్తున్నారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు 78లక్షల 9వేల 890 టీకా డోసులు సర్కారుకి అందగా.. అందులో 77 లక్షల 35వేల 358 టీకాలు వినియోగించారు. ఇక అటు ప్రైవేటులోనూ ఇప్పటి వరకు సుమారు పది లక్షల డోసులు అందించినట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇదీ చదవండి:ప్రపంచవ్యాప్తంగా కరోనాకు 40 లక్షల మంది బలి