తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్ - కరోనా టీకా పంపిణీ

లాక్​డౌన్​ నుంచి వ్యాక్సినేషన్, కరోనా నిర్ధరణ పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో రెండో డోస్ లబ్ధిదారులు వ్యాక్సినేషన్ కేంద్రాలకు చేరుకున్నారు.

covid-vaccination-continue-in-the-state
రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్‌ వ్యాక్సినేషన్

By

Published : May 12, 2021, 11:21 AM IST

రాష్ట్రంలో కొవిడ్​ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 45 ఏళ్లు నిండిన వారికి యథాతథంగా రెండో డోస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని సూచించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రక్రియ జరగనుంది. టీకా వేయించుకునే వారికి లాక్​డౌన్​ ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తుంది.

టీకా ధ్రువీకరణ పత్రం చూపిస్తే కేంద్రాలకు అనుమతించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

ఇదీ చూడండి:ప్రాణాలకు తెగిస్తూ.. పునర్జన్మ అందిస్తూ...

ABOUT THE AUTHOR

...view details