తెలంగాణ

telangana

ETV Bharat / state

వైన్​షాపుల ముందు నిబంధనలు బేఖాతర్​! - తెలంగాణలో మద్యం దుకాణాల ముందు మందుబాబుల బారులు

రాష్ట్రంలో మద్యం దుకాణాల వద్ద కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదు. మాస్క్‌లు లేకుండా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. "మాస్క్‌ ఉంటేనే మద్యం'' అని కొన్ని దుకాణాల వద్ద రాసినా అమలుకు నోచుకోవడం లేదు

Liquor
మాస్క్‌ ఉంటేనే మద్యం

By

Published : Apr 20, 2021, 8:34 AM IST

Updated : Apr 20, 2021, 12:05 PM IST

వైన్​షాపుల ముందు నిబంధనలు బేఖాతర్​!

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ విస్తరణకు మద్యం దుకాణాలు కూడా కారణమవుతున్నాయి. కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం వల్లనే కరోనా విస్తరణకు ఇవి కారణమవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలు, వెయ్యికిపైగా బార్లు, రెస్ట్రారెంట్లు, క్లబ్‌లు, పబ్‌లు ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని మాల్స్‌లో కూడా మద్యం విక్రయాలకు లైసెన్స్‌లు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు వంద కోట్లకుపైగా విలువ మద్యం అమ్ముడు పోతుంది. వారాంతాల్లో అయితే... నూటాయాభై కోట్లు రూపాయలు అంతకంటే ఎక్కువ విలువ చేసే మద్యం విక్రయాలు జరుగుతాయి.

కొన్ని మద్యం దుకాణాలు వద్ద మాస్కులు వాడుతున్నప్పటికీ వాటిని సక్రమంగా పెట్టుకోకుండా విక్రయదారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరైతే మాస్కులే లేకుండానే మద్యం అమ్ముతున్నారు. కొనుగోలుదారులు సైతం కొందరు మాస్కులు లేకుండానే దుకాణాల నుంచి మద్యాన్ని కొంటున్నారు. దుకాణాలకు అనుబంధంగా ఉన్న మద్యం సేవించే ప్రదేశాల్లో మాస్కులు అసలు ధరించడం లేదు. ఎక్కువ మంది దగ్గర దగ్గర కూర్చొని మద్యం సేవించడం ద్వారా కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు. దుకాణాలకు అనుబంధంగా చిరుతిళ్లు, సోడా, నీళ్ల సీసాలు అమ్మేవారిలో ఎక్కువ భాగం మాస్కులు ధరించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు.

హైదరాబాద్‌ లాంటి నగర ప్రాంతాల్లో మాస్కులు కొంతలో కొంతైనా వాడుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో మరింత నిర్లక్ష్యం చేస్తున్నట్లు అబ్కారీ శాఖ అధికారుల పరిశీలనలో తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో కొవిడ్‌ నిబంధనలు అమలుపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అధికారులు మిన్నకుండి పోతున్నారు. ఎంతసేపు... రాష్ట్రంలో గుడుంబా తయారీపై, అక్రమ మద్యం సరఫరాపై నిఘా పెట్టడం, ప్రతి రోజు ఎంత విలువ చేసే మద్యం అమ్ముడు పోతుందో పర్యవేక్షించడంలో అబ్కారీ శాఖ యంత్రాంగం మునిగితేలుతోంది. ఇప్పటికైనా... కొవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలయ్యేట్లు చర్యలు తీసుకున్నట్లయితే కొంతలో కొంతైనా విస్తరణకు అడ్డుకట్ట వేసినట్లవుతుంది.

Last Updated : Apr 20, 2021, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details