Corona mutations: ఒమిక్రాన్..టీకాలకూ లొంగటం లేదా..? రెండు డోసులు తీసుకున్న వారికీ ఎందుకు సోకుతోంది? ఈ ప్రశ్నలకూ సమాధానమిస్తున్నారు డాక్టర్ శ్రీధర్. ప్రస్తుతం ఒమిక్రాన్ వ్యాప్తి నియంత్రణలోనే ఉన్నట్లు అనిపిస్తున్నా... ఎప్పుడు ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో చెప్పలేమన్నది ఆయన అభిప్రాయం. ముందస్తు చర్యలు తీసుకోకపోవటం వల్లే డెల్టా వేరియంట్‌తో సమస్యలు ఎదుర్కొన్నామని... ఈసారీ అదే నిర్లక్ష్యం వహిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదనీ అంటున్నారు. టీకాలకు లొంగకుండా ఒమిక్రాన్ ఎలా తప్పించుకుంటోందో కూడా వివరించారు. బూస్టర్ డోస్ ప్రస్తావనా తీసుకొచ్చారు. బూస్టర్ డోసు ఎవరికి? ఎప్పుడు అవసరమన్నదీ స్పష్టతనిచ్చారు. ఒమిక్రాన్‌తో రీ-ఇన్‌ఫెక్షన్లూ అధికంగా కనిపిస్తున్నందున... జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు... డాక్టర్ శ్రీధర్.
Corona mutations: 'కరోనా మ్యుటేషన్ల వల్లే యాంటీబాడీలూ పని చేయటం లేదు' - Corona mutations news
Corona mutations: ఒమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కొవిడ్-19 పరిశోధకులు డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఏ మాత్రం అలసత్వం వహించినా.. మూడో ముప్పు తప్పదని అంటున్నారు. వ్యాక్సిన్లకు లొంగకుండా ఒమిక్రాన్ ఎలా విస్తరిస్తుందో వివరించారు. అమెరికాలో బూస్టర్ డోస్ అందిస్తున్నారని... ఇండియాలో ఇంకా స్పష్టతనివ్వలేదని పేర్కొన్నారు.
Corona mutations