హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌కు కొవిడ్ పాజిటివ్
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కరోనా చాపకింద నీరులా విజృంభిస్తోంది. కొవిడ్ వైరస్ ఎవ్వరినీ వదలడం లేదు. తాజాగా హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది.
హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌కు కొవిడ్ పాజిటివ్
ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఇదీ చూడండి :'కరోనా సోకితే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి'