హైదరాబాద్ నగరంలో రోజురోజుకు కొవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో కొవిడ్ నిర్ధరణ పరీక్షల కోసం అనుమానితులు క్యూ కడుతున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా శుక్రవారం సుమారు 120 కేసులు వచ్చాయి. కొవిడ్ నిబంధనలు గాలికొదిలేయడం వల్ల గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని అధికారులు తెలిపారు.
ముషీరాబాద్ పరిధిలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు - తెలంగాణలో కొత్త కరోనా కేసులు
ముషీరాబాద్ నియోజకవర్గంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ అనుమానితులు పరీక్షల కోసం బారులు తీరుతున్నారు. నియోజకవర్గంలోని ముషీరాబాద్, బోలక్పూర్, కవాడిగూడ, దోమలగూడ, బైబిల్హౌస్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిత్యం పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తున్నారు.
Musheerabad, covid
ప్రధానంగా మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వైరస్ వ్యాప్తికి కారణమవుతోందని వైద్యులు తెలిపారు. సమూహాలుగా గుమిగూడడం, అనవసరంగా రోడ్లపై తిరగడం వల్ల కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
ఇదీ చూడండి:కరోనా బారినపడి హెడ్ కానిస్టేబుల్ మృతి