తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ: సత్తెనపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద కరోనా బాధితుల పడిగాపులు - coron news guntur district

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కరోనా పాజిటివ్ రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారుల సమన్వయలేమితో సుమారు 5 గంటలపాటు ఆర్టీసీ బస్టాండ్​లో పడిగాపులు పడ్డారు.

covid-patients-waiting-at-satthenapally-bus-stand-guntur-district
ఏపీ: సత్తెనపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద కరోనా బాధితుల పడిగాపులు

By

Published : Jul 24, 2020, 9:07 AM IST

ఏపీలోని గుంటూరు జిల్లాలో అధికారుల సమన్వయ లేమితో కరోనా పాజిటివ్ రోగులు ఇబ్బందులు పడ్డారు. సత్తెనపల్లిలో పాజిటివ్ వచ్చిన 30 మందిని కొవిడ్ కేంద్రానికి తరలించాలని అధికారులు నిర్ణయించారు. వారిందరిని ఆర్టీసీ బస్టాండ్​కు రమ్మని సమాచారం ఇవ్వగా అక్కడికే చేరుకున్న బాధితులు సుమారు 5 గంటలపాటు పడిగాపులు పడ్డారు.

చివరకు కొవిడ్ కేర్ కేంద్రంలో ఖాళీ లేదని.. ఇంటికి వెళ్లి శుక్రవారం ఉదయం రమ్మని అధికారులు సమాచారం ఇచ్చారు. ఇళ్లకు వెళ్తే కుటుంబ సభ్యులకు ఇబ్బందవుతుందని బాధితులు అందోళనకు దిగారు. గంటలపాటు తమను రోడ్డుపై ఉంచడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికు రాత్రి 9.30 గంటల సమయంలో అధికారులు వారిని కాటూరి ఆస్పత్రికి తరలించారు.

సత్తెనపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద కరోనా బాధితుల పడిగాపులు

ఇదీ చదవండి: గోనె సంచిలో మృతదేహం... గుంటూరులో కలకలం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details