'మాకు సేవలు అందించినందుకు... మీకు ధన్యవాదాలు'
విపత్కర పరిస్థితుల్లో కూడా... సేవలు అందించిన నర్సింగ్ విద్యార్థులకు... కొవిడ్ రోగులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు రింగురోడ్డులోని కరోనా కేర్ సెంటర్లో నర్సింగ్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులను విధుల్లో నియమించారు. వారికి పరీక్షల షెడ్యూల్ విడుదల కావటంతో విధుల నుంచి రిలీవయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్ కేర్ సెంటర్లో ఉన్నవారు వారికి కృతజ్ఞతా పూర్వకంగా పూలు చల్లుతూ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి యాస్మిన్‌తో పాటు కరోనా కేర్ సెంటర్ ఇంఛార్జ్ టాండన్ పాల్గొన్నారు.
'మాకు సేవలు అందించినందుకు... మీకు ధన్యవాదాలు'
....