హైదరాబాద్ సూరారం కాలనీలోని ఓ కుటుంబం కరోనాపై వినూత్న పద్ధతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ‘మా ఇంటికి ఎవరూ రావద్దు.. మేమూ మీ ఇంటికి రాము’ అంటూ ఇంటి బయట పేపర్ అతికించి స్థానికులను మేల్కొలుపుతున్నారు. ప్లాస్టిక్ కవర్లతో ఇంటిలోనికి అడుగు పెట్టోందంటూ కిరాయి వాళ్లని హెచ్చరిస్తున్నారు. కాలనీ సంక్షేమం కోసమే నిర్ణయం తీసుకున్నట్లు యజమాని, సామాజిక కార్యకర్త రవీందర్ పేర్కొన్నారు.
‘మా ఇంటికి ఎవరూ రావద్దు.. మేమూ మీ ఇంటికి రాము’ - వైరస్ కట్టడి
కరోనా రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో వైరస్ కట్టడికి కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు హైదరాబాద్‌లోని సూరారం కాలనీ వాసులు. మా ఇంటికి ఎవరూ రావొద్దంటూ ఇంటి బయట పేపర్ అతికించి స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు.
covid patient awareness
వైరస్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని రవీందర్ కోరారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌తో తిరగాలని సూచించారు. తనతో పాటు కొవిడ్ బారిన పడ్డ తన తండ్రి (85).. వైద్యుల సలహాలను పాటిస్తూ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు చెప్పుకొచ్చారు. కరోనా సోకి.. చికిత్స అందుకుంటున్నపేదలను తమకు తోచిన విధంగా ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:భార్యాభర్తలను బలి తీసుకున్న కరోనా మహమ్మారి