తెలంగాణ

telangana

ETV Bharat / state

రోటరీ క్లబ్​ ఉదారత.. వృద్ధులకు కరోనా కిట్లు వితరణ - హైదరాబాద్​లో కరోనా కిట్ల అందజేత

జంటనగరాల వృద్ధాశ్రమంలోని వృద్ధులు కరోనా బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన రక్షణ కిట్లను సికింద్రాబాద్​ రోటరీక్లబ్​ వితరణ చేసింది. దాదాపు 11లక్షల రూపాయలు విలువ చేసే ఈ కిట్లను పంజాగుట్ట నుంచి ప్రారంభించి నగరంలోని 40 ఆశ్రమాలకు అందజేశారు.

covid kits distributed to the old age homes by rotary club in hyderabad
రోటరీ క్లబ్​ ఉదారత.. వృద్ధులకు కరోనా కిట్లు వితరణ

By

Published : Aug 5, 2020, 1:38 PM IST

భాగ్యనగరంలో వివిధ వృద్ధాశ్రమాల్లో జీవిస్తున్న వయోవృద్ధులు కరోనా బారినపడకుండా ఉండేందుకు అవసరమైన వస్తువులను సికింద్రాబాద్ రోటరీ క్లబ్ వితరణ చేసి ఉదారతను చాటుకుంది. 40 వృద్ధాశ్రమాల్లో ఉన్న 2 వేల మందికి తమ క్లబ్ తరఫున కొవిడ్ నుంచి రక్షణ పొందే కిట్లను అందజేసింది.

11 లక్షల రూపాయల విలువ చేసే ఈ కిట్లను పంజాగుట్టలో రోటరీ క్లబ్ సికింద్రాబాద్ అధ్యక్షుడు విజయ్ రాథీ, జిల్లా గవర్నర్ ఎన్వీ హనుమంతరెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రోటరీ క్లబ్ చేపడుతున్న సామాజిక కార్యక్రమాల్లో భాగంగా నేడు జంటనగరాల పరిధిలోని 40 వృద్ధాశ్రమాలకు ఆక్సీమీటర్లు, బీపీ మిషన్లు, శానిటైజర్ స్టాండ్లు సహా ఇతరత్ర మందులు పంపిణీ చేసినట్లు డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమంతరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!

ABOUT THE AUTHOR

...view details