తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎంఎస్​ఎంఈల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది'

కొవిడ్​ మహమ్మారి ప్రత్యక్షంగా మనిషిని చావుదెబ్బ కొడుతుంటే.. పరోక్షంగా మధ్యతరగతి ప్రజల కడుపుపై కొడుతుంది. కరోనా ప్రభావం వల్ల సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల భవిష్యతు ప్రశ్నార్థకంగా మారింది. ముడిసరకు దొరక్క, ఉత్పత్తి నిలిచిపోయి. ఉన్న సరుకు అమ్ముడు పోక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి.

tics
venugopal rao

By

Published : May 2, 2021, 5:38 PM IST

కరోనా మహమ్మారి ధాటికి సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని పారిశ్రామిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు రోజురోజుకు పెరిగిపోతున్న కేసులు, లాక్​డౌన్​ భయాలు.. అమ్మకాల ఒత్తిడితో సతమతమవుతున్నాయి. ముడిపదార్థాల సరఫరాలో అడ్డంకులు ఏర్పడి ఇప్పటికే చాలా పరిశ్రమలు మూతపడే దశకు చేరుకున్నాయని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య సీనియర్​ సంయుక్త కార్యదర్శి గోపాల్​రావు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎంఎస్​ఎంఈల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. కొవిడ్​ సెకండ్​వేవ్​ వల్ల రోజువారీ ఉత్పత్తి నిలిచిపోయిందని వెల్లడించారు. సుమారు 50శాతం కార్మికుల కొరత ఉందని... వారిలేని లోటును పూడ్చలేమని తెలిపారు. పరిశ్రమల్లో కొవిడ్​ కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు గోపాల్​రావు తెలిపారు.

ఈ సమయంలో ఆక్సిజన్​ అడగలేం...

ప్రస్తుతం దేశంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పరిశ్రమలకు ఆక్సిజన్‌ అడగలేమని.. తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య స్పష్టం చేసింది. కేంద్రం దీర్ఘకాలిక ప్రణాళికలు, ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉత్పత్తి నిలిచిపోయిన పాశమైలారం, చర్లపల్లిలోని ఆక్సిజన్ ప్లాంట్లను పునరుద్ధరిస్తే మరింత సహకారం అందిస్తామని గోపాల్​రావు వెల్లడించారు.

ఈ సమయంలో పరిశ్రమలకు ఆక్సిజన్​ అడగలేం

ఇదీ చూడండి:ఖరీదవుతున్న కరోనా వైద్యం.. హైరానా పడుతున్న జనం

ABOUT THE AUTHOR

...view details