రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా నిబంధనలు పాటించని మరో 6 ఆస్పత్రుల కొవిడ్ సేవల లైసెన్సులు రద్దు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి, గచ్చిబౌలి సన్షైన్ ఆస్పత్రి, బంజారాహిల్స్ సెంచరీ ఆస్పత్రి, లక్డీకాపుల్ లోటస్ ఆస్పత్రి, ఎల్బీ నగర్ మెడిసిస్ ఆస్పత్రి, టోలిచౌకీలోని ఇంటెగ్రో ఆస్పత్రుల కొవిడ్ లైసెన్సులను సర్కారు తాజాగా రద్దు చేసింది.
నిబంధనలు పాటించని 6 కొవిడ్ ఆస్పత్రుల లైసెన్సులు రద్దు - telangana varthalu
కొవిడ్ ఆస్పత్రులపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించని ఆస్పత్రులపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లోని ఆరు ఆస్పత్రుల కొవిడ్ సేవల లైసెన్సులు రద్దు చేశారు.
![నిబంధనలు పాటించని 6 కొవిడ్ ఆస్పత్రుల లైసెన్సులు రద్దు covid hospitals licence cancel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11982944-751-11982944-1622566275693.jpg)
నిబంధనలు పాటించని 6 కొవిడ్ ఆస్పత్రుల లైసెన్సులు రద్దు
దీనితో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 22 ఆస్పత్రుల కొవిడ్ లైసెన్సులు రద్దయ్యాయి. ఆయా ఆస్పత్రులు ఇప్పటికే తమ వద్ద ఉన్న కొవిడ్ బాధితులు కోలుకునే వరకు చికిత్స అందించాలని.. కొత్త వారిని ఆసుపత్రిలో చేర్చుకోవద్దని సర్కారు ఆదేశించింది.
ఇదీ చదవండి: Corona cases: రాష్ట్రంలో కొత్తగా 2,493 కరోనా కేసులు, 15 మరణాలు