తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాతో నష్టాల ఊబిలో మామిడి రైతులు - తెలంగాణ వార్తలు

కరోనా ఉద్ధృతి, వ్యాపారుల సిండికేట్‌ దందా, ఏమీ పట్టనట్టుండే అధికారుల నిర్లక్ష్య ధోరణి.. వెరసి ఎప్పటిలాగే మామిడి రైతులను కష్టాలు, నష్టాలు చుట్టుముడుతున్నాయి. ఈ యేడు పంట బాగా పండినా సరైన ధర లేక మామిడి పండించిన కర్షకుడికి ఆశించిన ఫలం అందడం లేదు. పెట్టుబడిలో సగమైనా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

mango
మామిడి రైతులు

By

Published : May 9, 2021, 3:59 AM IST

మామిడి రైతులు

మామిడి రైతుల పరిస్థితి ఏటికేడు దిగజారిపోతోంది. దిగుబడి బాగానే వచ్చినా కష్టాలు మాత్రం తప్పడం లేదు. గతేడాది సీజన్‌ సమయంలో లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు.. ఈసారీ నిరాశే ఎదురవుతోంది. కరోనా ప్రభావంతో దిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికితోడు మార్కెట్లలో వ్యాపారుల సిండికేట్‌ దందాతో సరైన ధర లేక నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నారు. పంట బాగా పండినా సరైన ఫలం మాత్రం అందడం లేదు. హైదరాబాద్‌ గడ్డిఅన్నారం మార్కెట్‌లో... మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ పూర్తిగా కొరవడటంతో... కమీషన్ ఏజెంట్లు ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నారు. తమకు తోట వద్ద వచ్చిన ధర కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సిండికేట్‌గా మారి ధరను నిర్ణయిస్తున్నారు

గడ్డిఅన్నారం మార్కెట్‌లో నిత్యం 15 నుంచి 20 వేల టన్నుల మామిడి క్రయ, విక్రయాలు సాగుతున్నాయి. కరోనా భయంతో అందరూ వ్యాపారులు రావడం లేదు. వచ్చిన నలుగురైదుగురు సైతం సిండికేట్‌గా మారి ధరను నిర్ణయిస్తున్నారు. కనిష్ఠ ధర 800 రూపాయలు... గరిష్టంగా 3 వేల 800 రూపాయలు చెల్లించి రైతుల నుంచి వ్యాపారుల మామిడి కొనుగోలు చేశారు. సుదూర ప్రాంతాలనుంచి వ్యయప్రయాసలకోర్చి మామిడి కాయలు తీసుకొస్తే... మార్కెట్‌లో సరైన ధర రాక నష్టపోతున్నామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

సౌకర్యాల లేమి

ధరలు లాభ, నష్టాలు పక్కనబెడితే మార్కెట్లో కనీస సౌకర్యాలు లేవని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాయిలెట్లు, మంచినీటి సౌకర్యం లేక అవస్థలు పడాల్సి వస్తోందని గోడు వెళ్లబోసుకుంటున్నారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో సిబ్బంది, వ్యాపారులు, హమాలీలు, కూలీలు... ఇలా దాదాపు 15 మంది వరకు కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. అయినా సరైన జాగ్రత్తలు లేవని.. అధికారులు, మార్కెట్‌ కమిటీ పాలకవర్గం కనీసం అటువైపు రావడం లేదని రైతులు, వ్యాపారులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి:టీకా కష్టాలు: గంటల తరబడి కేంద్రాల వద్ద పడిగాపులు

ABOUT THE AUTHOR

...view details